Wednesday 7 June 2017

రఘు అనే నేను - 2


     Special thanks to abhinay..!

       *    22 - జూన్ - 2012   *

ఎక్కువ రిస్క్ తీసుకోకుండా హాస్టల్ కి దగ్గరగా వున్న కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవుదాం అని డెమో క్లాస్ కి వెళ్ళాను..డెమో క్లాస్ మొదలయ్యి 10 నిమిషాలు అవుతుంది..క్లాస్ ని అదరగొడుతున్నాడు చెప్పటానికి వొచ్చిన సార్..నిశబ్ధంగా వున్న క్లాస్ డోర్ దగ్గర నుండి EXCUSE ME SIR అంటూ ఒక అమ్మాయి వాయిస్..

   క్లాస్ లో వున్న అబ్బాయిలందరూ ఒక్క నిమిషం పాటు తనవైపు తదేకంగా చూస్తూ కనురెప్ప కొట్టటమే మరిచిపోయారు..
అందానికే పర్యాయపదంలా...
అలంకారం అన్న పదానికే నానార్థం లా వుంది తను.

ఆమెను చూస్తూ నా డెమో క్లాస్ వినడమే మర్చిపోయాను..ఆ అమ్మాయి మా కాలేజీ.. ఇంకా చెప్పాలి అంటే మా పక్క సెక్షనే..
క్లాస్ అయిపోయాక వెళ్తుంటే..తనే వొచ్చి
హలో EXCUSE ME మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు వుంది..మీది గురునానక్ కాలేజీ నా..
అవును ...మీ పక్క సెక్షనే నేను..నా పేరు రఘు ,మీ పేరు హారిక కదా..
అవును..
మొత్తానికి పరిచయం అయిపోయింది..
     

హారిక
     ఆమె అందాన్ని వర్ణించాలి అంటే ఎంత పెద్ద కవి అయినా మాటలు వెతుక్కోవాల్సిందే..నుదిటి మీద తెలుగు అమ్మాయిని అని చెప్పటానికి సింబాలిక్ గా చిన్న బొట్టు.. చెవులకు పెద్ద ,పెద్ద హ్యాంగింగ్స్..ఎర్రటి పెదాల మీద ఎప్పుడు చెరగని చిరునవ్వు..యింక ఆ నడుము గురించి చెప్పాలి అంటే ఆహా..మగవాడికి పిచ్చి ఎక్కించటానికే దేవుడు తయారు చేశాడు అనుకుంటా..
అందుకే నేమో కాలేజ్ లో ఆమె వెనుక తిరిగి తిరిగి దేవదాసు లు అయినవారు ఎందరో..

మొదట్లో హయ్, బాయ్ లతో సాగిన మా పరిచయం ఒకటే కాలేజ్ కావటం వలన రోజులు గడుస్తున్నా కొద్దీ తొందరగా ఫ్రెండ్ అయ్యాము..ఎంతలా అంటే ఏ చిన్న విషయం అయినా నాతొ షేర్ చేసుకునేది..వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి తను చేసిన షాపింగ్స్ గురించి కూడా చెపుతూ ఉండేది..ప్రతి రోజు ఫోన్ చేసి మాట్లాడేది..
చూస్తూ వుండగానే C అయిపోయి JAVA స్టార్ట్ అయింది.

                 *  ఆగష్టు -2012  *

ఎప్పటిలాగే కాల్ చేసి రేపు తన బర్త్ డే అని కొంత మందినే INVITE చేస్తున్నాను..నువ్వు కూడా తప్పకుండా రావాలి అని చెప్పిన సంఘటన నేను ఎప్పటికి మర్చిపోలేను..
( ఆ కొంత మందిలో నేను వున్నందుకు ఆ క్షణం నేను ఎంతో సంతోషపడ్డాను ).
బర్త్ డే పార్టీలో మిణుకు మిణుకు మంటున్న ఆ వెలుగుల్లో ముందుకు పడుతున్న ముంగిర్లను వెనక్కి నెడుతూ...అదిరిపోయే బర్త్ డే డ్రెస్ లో అందరిని ఆకర్షించేలా వుంది..వాళ్ళ పేరెంట్స్ కి నన్ను పరిచయం చేసింది..
మా అమ్మా, నాన్న అంటే నాకు చాలా ఇష్టం ..ఒక్కటే కూతుర్ని కాబట్టి చాలా గారభంగా పెంచారు..వారి ఇష్టానికి విరిద్దంగా నేను ఏ పని చెయ్యను అని హారిక చెప్పే మాటల్లో తన పేరెంట్స్ మీద తనకి వున్న ప్రేమ ని నేను తెలుసుకోగలిగాను..

తన వేసుకున్న డ్రెస్ ఎఫక్టో తెలియదు..ఏంటో తెలియదు గాని పార్టీ నుండి వొచ్చి పడుకుందాము అనుకుంటే కళ్ళు మూసినా తెలిసిన ఆమె రూపమే..ఎంత మర్చిపోదాం అనుకున్నా నా వల్ల కావటం లేదు..తన ఒక్క రోజు కనపడక పోయినా ఫోన్ చేసి ఏమయిందో తెలుసుకునే వరకు ఎదో వెలితిగా ఉండేది తను పంపిన గుడ్ మార్నింగ్ తోనే నా డే స్టార్ట్ అయ్యేది..తను కూడా అంతే నేను ఒక్క రోజు కనపడక పోయిన వెంటనే ఫోన్ చేసి ఏమైందో తెలుసుకునేది..

అలా SUNDAY లతో కూడా సంబంధం లేకుండా మా పరిచయం సాగిపోతుంది..

ఏంటి తనని చూడకుండా ఉండలేక పోతున్నాను..
ప్రేమిస్తున్నానా..??
ఛా.. ఛా.. తాను నా ఫ్రెండ్ కదా అలాంటిది ఏం లేదు..
ఒక వేళ తనకు కూడా ఇలాంటి ఫీలింగే వుందా..ఎలా తెలుసుకోవాలి..
ఇలా నాలో నేను మధన పడుతూ ఉండగా అనుకోకుండా ఒక రోజు...

( please check my website..to read more blogs..)

( Raghuchowdary87.blogspot.com)

NEXT EPISODE WILL BE UPDATED SOON
                                      
                                                  రచన
                                             రఘు చౌదరి

No comments:

Post a Comment